Friday, 29 March 2013

అమ్మ నీకు జొహరు

చందమామ రావే ...జాబిల్లి రావే...అని అమ్మమనకి గోరు ముద్దలు పెడుతూ పాడిన  పాట  మర్చిపోగలమా ? జో అచుతానంద జోజో ముకుందా అని అమ్మ పాడిన లాలి పాట  ని మర్చిపోగలమా ? తలుపుని తన్నుకుని పడిపోతే "అన్నా ... " అని అమ్మ తలుపుని కొట్టి మనల్ని ఓదార్చిన మధుర క్షణాలను మర్చిపోగలమా? ఇవన్ని మర్చిపోవడం ఎంత పాపమో,మనని నవ మాసాలు మోసి కానీ పెంచి తల్లి ని మర్చిపోతే అంతే పాపం.అమ్మ చేసే త్యాగాలు ఇంక ఎవరు చెయ్యలేరు. చిన్నప్పుడు మన చదువుకై  ఎంతో సహాయం చేసిన కరుణా మూర్తి అమ్మ. మనకి దెబ్బ తగిలితే విలవిలలాడి పోయేది అమ్మ ప్రాణమే . మనల్ని బడికి పంపించడానికి తను త్వరగా లేచి, మన నిద్ర చెదకుడదని తను పని నెమ్మదిగా చేసుకుని స్నానం చేసి, దేవుడికి పూజ చేసి,మనం ఎటువంటి కష్టాలు ఎదురుకోకుడదని మొక్కుకుని , ఇంట్లో తొలి దీపం వెలిగించి,వంట కార్యక్రమం పూర్తి చేసి,మనల్ని లేపి,స్నానం చేయించి,మనల్ని బడి కి పంపించేది. ఇదే  తన దినచర్య గా మలుచుకుని, మనకోసం తన ఇష్టాలను  త్యాగం చేసి,త్యాగమూర్తి గ నిలిచింది అమ్మ.మనం పై చదువులకు దూర ప్రదేశాలకు వెళ్తే ," నా బాబు ఎలా ఉన్నడో,తిండి సరిగ్గా తింటున్నాడో  లేడో " అని నిరంతరం కలవరపడే మాతృమూర్తి  అమ్మ. మనం గొప్ప ఉద్యోగం సంపాదించినప్పుడు అందరికంటే ఎక్కువ గర్వపడేది మన అమ్మే . అలాంటి మన అమ్మకి మనం ఎం చేస్తున్నాం? మన అమ్మ మన కోసం చేసినదానికి కనీసం ఒక వంతు ఋణం తీర్చుకోగలిగితే మన జన్మ కి ఒక అర్ధం ఉంటుంది."అమ్మ,నువ్వు నా కోసం చేసిన దానికి జోహారు !!! ఏమిచి నీ ఋణం తీర్చుకోగలను???...నిన్ను ఏ విధంగా బాధ పెట్టినా నొప్పించినా  నన్ను క్షమ్నించు " 

No comments: